Showing posts with label Yesayya. Show all posts
Showing posts with label Yesayya. Show all posts

Wednesday, February 18, 2015

Andharu Nannu - అందరు నన్ను విడచిన




Verse 1

అందరు నన్ను విడచిన
నీవు నన్ను విడవనంటివే (2)
నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్య… (2)


Verse 2
వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టిన…. (2)
నా కొండవు నీవే, నా కోటాయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్య (2)


Verse 3
లోకము నన్ను విడచిన
నీవు నన్ను విడవనంటివే… (2)
నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్య (2)


Verse 4
నేను నిన్ను నమ్ముకొంటీని
నీవు నన్ను భయపడకంటివే (2)
నా తోడుయు నీవే, నా నీడవు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్య (2)


Monday, February 16, 2015

Neevuntey Naaku Chalu - నీవుంటే నాకు చాలు యేసయ్యా



Chorus
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేను వుంటా నేసయ్యా (2)
నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా (2)


Verse 1
ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను.


Verse 2
బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను
అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన.


Verse 3
ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా.


Verse 4
నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము.