Showing posts with label Andhra Kraisthava Keerthanalu. Show all posts
Showing posts with label Andhra Kraisthava Keerthanalu. Show all posts

Thursday, February 19, 2015

# 165 - Elatidha Yesu Prema - ఈ లాటిదా యేసు ప్రేమ

Chorus
 ఈ లాటిదా యేసు ప్రేమ
 నన్ను= తులానాడక తనదు-జాలి జుపినదా
 ఈ లాటిదా యేసు ప్రేమ

Verse 1
 ఎనలేని పాపకూపమున-
 నేను తనికి మినుకుచుచు నే-దరి గానకుండన్
 కనికరము బెంచి నాయందు-
 వేగ-గొని పోవనా మేలు-కొరకిందు వచ్చె

Verse 2
 పెనుగొన్న దుఖాబ్దిలోన-
 నేను - నేను-మునిగి కుములుచు నేడు-పునగుందు-నపుడు
 నను నీచుడని త్రోయలేక-
 తనదు-నెనరు నా కగుపరచి- నీతి జూపించే

Verse 3
 నెమ్మి రావ్వంతైన లేక-చింత-
 క్రమ్మి పోగలుచు నుండు-గా నన్ను జూచి-
 సమ్మతిని నను బ్రోవధలచి -
 కరము జూచి న చేయి బట్టి - చక్కగా బిలిచె

Verse 4
 పనికిమాలిన వాడనైన-నేను
 కనపరచు నాదోష-కపటవర్తనము-
 మనసు నుంచక తాపపడక
 యింత - ఘనమైన రక్షణ-మును నాకు జుపె

Verse 5
 నా కోర్కేలెల్ల సమయములన్-క్రింది-
 లోక వాంచల భ్రమసి-లోంగెడు వేళన్-
 చేకూర్చి దృడము చితమునన్-
 శుభము-నాకోసగె జీవింప నా రక్షకుండు

Verse 6
 శోధనలు నను జుట్టినప్పుడు-నీతి-
 బోధ నా మనసులో - బుట్టించి పెంచి-
 బాధ లెల్లను బాపి మాపి -
 యిట్టి యాదరణ జూపెనా యహహ యేమందు

Wednesday, February 18, 2015

#332- Aparaadhini Yesayya - అపరాధిని యేసయ్య

Verse 1
అపరాధిని యేసయ్య - క్రపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు ..అపరాధిని..


Verse 2
సిలువకు నినునే గొట్టితీ - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా ..అపరాధిని..


Verse 3
ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో ..అపరాధిని..


Verse 4
ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ ..అపరాధిని..


Verse 5
దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావినిడితి
ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను ..అపరాధిని..


Verse 6
ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్క్రూరుండనై గొట్టితిని - ఘోరంపి పాపిని దేవా ..అపరాధిని..