Thursday, February 19, 2015

# 165 - Elatidha Yesu Prema - ఈ లాటిదా యేసు ప్రేమ

Chorus
 ఈ లాటిదా యేసు ప్రేమ
 నన్ను= తులానాడక తనదు-జాలి జుపినదా
 ఈ లాటిదా యేసు ప్రేమ

Verse 1
 ఎనలేని పాపకూపమున-
 నేను తనికి మినుకుచుచు నే-దరి గానకుండన్
 కనికరము బెంచి నాయందు-
 వేగ-గొని పోవనా మేలు-కొరకిందు వచ్చె

Verse 2
 పెనుగొన్న దుఖాబ్దిలోన-
 నేను - నేను-మునిగి కుములుచు నేడు-పునగుందు-నపుడు
 నను నీచుడని త్రోయలేక-
 తనదు-నెనరు నా కగుపరచి- నీతి జూపించే

Verse 3
 నెమ్మి రావ్వంతైన లేక-చింత-
 క్రమ్మి పోగలుచు నుండు-గా నన్ను జూచి-
 సమ్మతిని నను బ్రోవధలచి -
 కరము జూచి న చేయి బట్టి - చక్కగా బిలిచె

Verse 4
 పనికిమాలిన వాడనైన-నేను
 కనపరచు నాదోష-కపటవర్తనము-
 మనసు నుంచక తాపపడక
 యింత - ఘనమైన రక్షణ-మును నాకు జుపె

Verse 5
 నా కోర్కేలెల్ల సమయములన్-క్రింది-
 లోక వాంచల భ్రమసి-లోంగెడు వేళన్-
 చేకూర్చి దృడము చితమునన్-
 శుభము-నాకోసగె జీవింప నా రక్షకుండు

Verse 6
 శోధనలు నను జుట్టినప్పుడు-నీతి-
 బోధ నా మనసులో - బుట్టించి పెంచి-
 బాధ లెల్లను బాపి మాపి -
 యిట్టి యాదరణ జూపెనా యహహ యేమందు

Wednesday, February 18, 2015

#332- Aparaadhini Yesayya - అపరాధిని యేసయ్య

Verse 1
అపరాధిని యేసయ్య - క్రపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు ..అపరాధిని..


Verse 2
సిలువకు నినునే గొట్టితీ - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా ..అపరాధిని..


Verse 3
ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో ..అపరాధిని..


Verse 4
ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ ..అపరాధిని..


Verse 5
దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావినిడితి
ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను ..అపరాధిని..


Verse 6
ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్క్రూరుండనై గొట్టితిని - ఘోరంపి పాపిని దేవా ..అపరాధిని..


Anni Namamulakanna - అన్ని నామముల

Verse 1
అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది క్రీస్తేసు నామము

Chorus
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ (2)

Verse 2
పాపముల నుండి విడిపించును _ యేసుని నామము
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును _ క్రీస్తేసు నామము

Verse 3
సాతాను పై అధికార మిచ్చును _ శక్తి గల యేసు నామము
శత్రు సమూహము పై జయమునిచ్చును _ జయశీలుడైన యేసు నామము

Verse 4
స్తుతి ఘన మహిమలు చెల్లించుచు _ క్రొత్త కీర్తన పాడెధము
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో _ స్తోత్ర గానము చేయుదము

Andharu Nannu - అందరు నన్ను విడచిన




Verse 1

అందరు నన్ను విడచిన
నీవు నన్ను విడవనంటివే (2)
నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్య… (2)


Verse 2
వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టిన…. (2)
నా కొండవు నీవే, నా కోటాయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్య (2)


Verse 3
లోకము నన్ను విడచిన
నీవు నన్ను విడవనంటివే… (2)
నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్య (2)


Verse 4
నేను నిన్ను నమ్ముకొంటీని
నీవు నన్ను భయపడకంటివే (2)
నా తోడుయు నీవే, నా నీడవు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్య (2)


Monday, February 16, 2015

Neevuntey Naaku Chalu - నీవుంటే నాకు చాలు యేసయ్యా



Chorus
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేను వుంటా నేసయ్యా (2)
నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా (2)


Verse 1
ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను.


Verse 2
బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను
అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన.


Verse 3
ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా.


Verse 4
నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము.